Ts News: కొత్త సంవత్సర వేళ.. బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్తులు

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 1 జనవరి 2022 ‌: నూతన సంవత్సరం సందర్భంగా భాగ్యనగరంలోని ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. కొత్త సంవత్సరం అంతా మంచి జరగాలని కోరుతూ నగరంలోని బిర్లా మందిర్‌కు వేకువజాము నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఈ కొత్త ఏడాది ఆరోగ్యాన్ని, సంతోషాన్ని ప్రసాదించాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు.. మొక్కలు తీర్చుకున్నారు. భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తడంతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఈ సందర్భంగా యువతి, యువకులు సెల్ఫీలు దిగుతూ ఆనందంగా గడిపారు. అయితే కరోనా, ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న వేళ.. భక్తులు కొవిడ్‌ నిబంధనలు పాటించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us