UPDATED 28th MAY 2017 SUNDAY 11:00 AM
పెద్దాపురం : మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చెయ్యాలని పెద్దాపురం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, 10వ కౌన్సిలర్ త్సలికి సత్యభాస్కరరావు పేర్కొన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ 95 వ జయంతి వేడుకలను ఆయన ఆధ్వర్యంలో పట్టణంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా స్థానిక రాగంపేట పుంతలోని ఎన్టీఆర్ విగ్రహనికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ అడుగుజాడల్లో ప్రతీ ఒక్కరూ నడుచుకోవాలని, అలాగే ఆయన ఆశయ సాధనతో ప్రతీ ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. అనంతరం మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో 9,10,11 వార్డుల టిడిపి అధ్యక్షులు కొత్తెం బాబు, కందుల శ్రీనివాస్, త్సలికి శ్రీనివాస్, ములకాల రామకృష్ణ, గువ్వల త్రిమూర్తులు, పోసపల్లి వెంకటరావు, బొండా వెంకటరమణ, ఉలవల శ్రీను, బాబి, ఎం.ఎల్.ఆలీ అధిక సంఖ్యలో టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.







