గోరింటలో చలివేంద్రం ఏర్పాటు

UPDATED 23rd  MAY 2017 MONDAY 10:00 AM

పెద్దాపురం: వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చెయ్యాలని టిడిపి  యువ నాయకుడు పచ్చిపాల సతీష్ పేర్కొన్నారు. మండలంలోని గోరింట గ్రామంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని ప్రతీ ఒక్కరు రహదారుల వెంబడి చలివేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పచ్చిపాల శ్రీను, కర్రి చంటిబాబు, గరగ సత్య కిషోర్, ఉప సర్పంచ్ కలగాడ పాపారావు, వంగలపూడి త్రిమూర్తులు, టిడిపి యూత్ పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us