ఏపీలో మళ్లీ తెరపైకి జిల్లాల పునర్విభజన?.. 25కు పెరగనున్న జిల్లాలు

అమరావతి (రెడ్ బీ న్యూస్) 27 నవంబర్ 2021: ఏపీలో జిల్లాల పునర్విభజన అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. నిన్న జరిగిన ఎంపీల సమావేశంలో దీనిపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. జనగణనకు సంబంధించి కేంద్ర గణాంకశాఖ జారీ చేసిన ఆదేశాలకు ఇబ్బంది లేకుండా ఈ ప్రక్రియ ప్రారంభించాలంటూ ఉన్నతాధికారులకు సీఎం జగన్‌ ఆదేశాలిచ్చినట్టు సమాచారం. జనగణన పూర్తయ్యేలోగా విభజనకు సంబంధించి ప్రాథమిక ప్రక్రియను పూర్తి చేసి నోటిఫికేషన్కు సిద్ధం కావాలని సీఎం సూచించినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి నుంచి జనగణన చేపట్టనున్న దృష్ట్యా ఈ ప్రక్రియను చేపట్టడంపై సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రి జగన్‌కు కొన్ని సూచనలు చేసినట్టు తెలుస్తోంది. కేంద్ర ఆదేశాలకు ఇబ్బంది లేకుండానే ఆర్థికేతర అంశాల్లో ప్రజాభిప్రాయ సేకరణ లాంటి కార్యాచరణను చేపట్టాలని ఆదేశాలిచ్చినట్టు వెల్లడవుతోంది. దీనిపై ఏర్పాటైన సీఎస్‌ కమిటీ, జిల్లా స్థాయి కమిటీలు కూడా ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాయి. సీసీఎల్‌ఏ కూడా జిల్లాల ఏర్పాటులో ఉన్న అంశాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. జిల్లాల ఏర్పాటుకు దాదాపు రూ.వేల కోట్ల మేర వ్యయం అవుతుందని కూడా రాష్ట్ర స్థాయి కమిటీ ప్రభుత్వానికి గతంలోనే నివేదించింది. పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు ప్రాథమిక స్థాయిలో కసరత్తు పూర్తి చేశారు. ఏడాది క్రితమే జిల్లాల పునర్విభజన ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టినప్పటికీ కొవిడ్‌ కారణంగా జాప్యం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనడంతో జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ముందుకొచ్చింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us