PM Modi: ప్రధాని మోదీకి తిరుమల, శ్రీశైలం అర్చకుల ఆశీర్వచనం

ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 1 జనవరి 2022: నూతన సంవత్సరం సందర్భంగా ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలైన తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీశైలం దేవాలయాల అర్చకులు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. కొత్త సంవత్సరంలో తొలిరోజైన శనివారం ఆయనకు వేదాశీర్వచనం అందించారు. అలాగే, శేష వస్త్రాలతో పాటు ఆలయాల నుంచి తమ వెంట తీసుకెళ్లిన ప్రసాదాలను ప్రధానికి బహూకరించారు. ఈ వీడియోను భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ట్విటర్‌లో పంచుకున్నారు. నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు చెప్పారు. ఈ సంవత్సరం అందరి జీవితాల్లో సంతోషాల్ని, మంచి ఆరోగ్యాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు. మనం సాధించిన ప్రగతిని, శ్రేయస్సును కొత్త స్థాయికి తీసుకెళ్లడంతో పాటు మన స్వాతంత్ర్య సమరయోధుల కలల్ని నెరవేర్చేందుకు మరింత కష్టపడి పని చేద్దామంటూ పిలుపునిచ్చారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us