Covid Rules : కరోనా నిబంధనలు అతిక్రమిస్తే రూ.25 వేలు ఫైన్, ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

UPDATED 15th FEBRUARY 2022 TUESDAY 04:30 PM

అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రోజూ వేల సంఖ్యలో నమోదైన పాజిటివ్ కేసులు.. ఇప్పుడు వందల సంఖ్యకు దిగొచ్చాయి. దీంతో.. రాష్ట్రంలో విధించిన నైట్ కర్ఫ్యూను ఎత్తివేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే కోవిడ్ నిబంధనలు మాత్రం కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ప్రభుత్వం సూచించింది. దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలంది.

బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించటం తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంది. మాస్కు ధరించని వారికి రూ.100 జరిమాన విధిస్తారు. ఇక వాణిజ్య ప్రదేశాల్లో కోవిడ్ నిబంధనలు పాటించకపోతే రూ.25 వేలు జరిమానా విధించనున్నారు. ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us