UPDATED 5th MAY 2017 MONDAY 4:30 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల ఏడవ తేదీన ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కళాశాల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఎ.పి.ఎస్.ఎస్.డి.సి సహకారంతో వెస్ట్ లైన్ షిప్పింగ్ సర్వీస్ కంపెనీ ఈ ఇంటర్వ్యూలను నిర్వహించడం జరుగుతుందని, ప్రత్యేకించి పురుషులు మాత్రమే ఈ ఇంటర్వ్యూలకు హాజరు కావాలన్నారు. 2015, 2016, 2017 సంవత్సరాలలో ఇంజనీరింగ్ లో సివిల్, ఈ ఈ ఈ, మెకానికల్, ఈసీఈ, సి ఎస్ ఈ, ఐటి విభాగాల్లో యాభై శాతం మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు దీనికి అర్హులన్నారు. ఎంపిక ప్రక్రియ రాతపరీక్ష ప్లేసెమెంట్ కు ముందు జరిగే ఇంటర్వ్యూ, వ్యక్తిగత ఇంటర్వ్యూలు, మెడికల్ టెస్టులు తదితర విధానాలు ద్వారా జరుగుతుందని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ అనంతరం నెలకు రూ.1.50 లక్షలు వేతనంతో ఉద్యోగం పొందవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని ఇంటర్వ్యూలకు సంబంధించి మరింత సమాచారం కోసం 9100444388 నెంబర్ లో సంప్రదించాలని ఆయన కోరారు.







