UPDATED 15TH MAY 2017 MONDAY 11:00 PM
అమరావతి: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమం స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 10 మంది స్వచ్ఛాంధ్ర అంబాసిడర్లను నియమిస్తున్నట్టు ప్రకటించింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఈ జాబితాలో చోటు కల్పించింది.
స్వచ్ఛాంధ్ర ప్రచారకర్తలు వీళ్లే..
* బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు (ఆధ్యాత్మిక వేత్త)
* కె. వరప్రసాద్ రెడ్డి (శాంతా బయోటెక్)
* ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే (హృద్రోగ వైద్యులు)
* జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
* ఏఎస్ కిరణ్‌కుమార్ (శాస్త్రవేత్త)
* నవీన్‌బాబు (సినీనటుడు)
* తుర్లపాటి కుటుంబరావు
* విద్యా ఖన్నా (జల శిక్షణ సంస్థాన్)
* పీవీ సింధు (బ్యాడ్మింట్ క్రీడాకారిణి)
* కేశిరాజు శ్రీనివాస్ (గాయకుడు)







