ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలి

UPDATED 25th JANUARY 2018 THURSDAY 6:00 PM

పెద్దాపురం: పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఓటరు దినోత్సవం సందర్భంగా ఆర్డీఓ వి.విశ్వేశ్వరావు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. భారతదేశం ప్రజాస్వామ్య దేశమని, పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతీ పౌరుడు ఓటు హక్కు కలిగి ఉండాలన్నారు. ఇంటివద్ద నుంచే ఆన్ లైన్ ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని, ఓటు వినియోగించుకున్నవారే నాయకులను, అధికారులను ప్రశ్నించే హక్కు ఉంటారన్నారు. పెద్దాపురం నియోకవర్గంలో జిల్లాస్థాయిలో మూడు వేల మందిని ఓటర్లుగా నమోదు చేయించిన ఆర్డీవోకి ఎన్నికల కమిషన్ అవార్డు ఇవ్వడం సంతోషకరమన్నారు. ఓటరు నమోదు ప్రక్రియలో మున్సిపల్, మెప్మా, అంగన్వాడీ, తదితర శాఖల సిబ్బంది కృషితో ఓటరు నమోదు కార్యక్రమానికి మంచి గుర్తిపు వచ్చిందని ఆయన తెలిపారు. ఆర్డీవో విశ్వేశ్వరావు మాట్లాడుతూ ఓటరు నమోదు ప్రక్రియలో పెద్దాపురం, సామర్లకోట మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, బూత్ లెవెల్ అధికారులు, మెప్మా సిబ్బంది, విఆర్వోలు కృషి వల్ల ప్రక్రియను సవ్యంగా నిర్వహించినందుకు అవార్డు రావడం సంతోషమన్నారు. జాతీయ ఓటరు దినోత్సవ ర్యాలీ  అనంతరం స్థానిక లూథరన్ హై స్కూల్ క్రీడా మైదానంలో రంగవల్లి, వకృత్వ, వ్యాసరచన, ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు, కొత్తగా ఓటరుగా నమోదు చేసుకున్నవారికి కార్డులు అందచేశారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం, సామర్లకోట తహసీల్దార్లు జి.వరహాలయ్య, శివకుమార్, ఎంపీడీవో పి. వసంతమాధవి, మున్సిపల్ కమీషనర్ బి.ఆర్. శేషాద్రి, మున్సిపల్ మేనేజర్ ప్రసాద్, టిపివో భాస్కరరావు, సామర్లకోట జూనియర్ కళాశాల లైబ్రేరియన్ శాంతిశ్రీ, టిడిపి పట్టణాదక్షుడు రంధి సత్యనారాయణ, వార్డ్ కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.            

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us