గండేపల్లి తహసీల్దార్ పై కలెక్టర్ ఫైర్

UPDATED 27th JULY 2017 THURSDAY 10:00 PM

గండేపల్లి:  విధినిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఓటుహక్కు సదస్సులో నియోజకవర్గ ఎన్నికల అధికారి ఎస్. భీష్మనంద్, తహసీల్దార్ గీతాంజలి పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు కళాశాలలో వేలాది మంది విద్యార్థులు ఉండగా, ఓటు హక్కు నమోదు దరఖాస్తులు కేవలం 400 మాత్రమే తీసుకురావడం, ప్రతిష్టాత్మకమైన ఓటు హక్కు అవగాహనా సదస్సు ఏర్పాటు చేసి దానికి అనుగుణంగా చర్యలు తీసుకోకపోవడంపై అధికారులను మందలించారు. ఈ నెల 29 వ తేదీ లోగా విద్యార్థులకు ఓటు హక్కు నమోదు దరకాస్తులు అందించి నమోదు చేయాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.       

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us