UPDATED 1st JUNE 2017 THURSDAY 2:00 PM
పెద్దాపురం : భక్తుల కొంగు బంగారం పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలకు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా సంప్రదాయం ప్రకారం అమ్మవారి ప్రతిరూపాలుగా భావించే గరగలను తీశారు. ఈ నెల 23 నుంచి జూలై 30 వరకు అమ్మవారి జాతర మహోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే పందిరి రాట మహోత్సవాన్ని ఆలయ అసిస్టెంట్ కమీషనర్ ఆర్.పుష్పనాధం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అలాగే గరగలను డప్పు వాయిద్యాలు, నృత్యాలతో వైభవంగా పట్టణ వీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అభివృద్ధి కమిటీ సభ్యులు తమ్మన మైనర్ బాబు, కొఠాని గణేష్, కొంగర సత్యనారాయణ, ఆకుల మురళీకృష్ణ, అర్జునరావు, కొప్పర్తి కృష్ణ, గోలి శ్రీరాములు, రాయి విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు







