UPDATED 18th JUNE 2017 SUNDAY 1:00 PM
పెద్దాపురం: స్వచ్ఛ పెద్దాపురం లక్ష్యంగా మన పెద్దాపురం ఫేస్ బుక్ బృంద సభ్యులు కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగా ఆదివారం గ్రూప్ సభ్యులు నాల్గోవ వార్డులో ఉన్న చేపలవారి వీధిలో క్లీన్ ఆర్మీ కార్యక్రమం నిర్వహించారు. వీధులను శుభ్రం చేశారు. అలాగే పరిసరాల పరిశుభ్రత పై ప్రజలకు కరపత్రాలు ద్వారా అవగాహన కల్పించారు. ఎక్కడపడితే అక్కడ చేత వేయకుండా ఉండేలా డస్ట్ బిన్స్ ఏర్పాటు చేశారు. అనంతరం బృంద సభ్యులు మాట్లాడుతూ మన పెద్దాపురం గ్రూప్ ద్వారా భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని చెప్పారు. పట్టణ అభివృద్ధికి, స్వచ్ఛ పెద్దాపురం కోసం గ్రూప్ సభ్యులు చేస్తున్న కృషిని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో బృంద సభ్యులు సిమ్మ లోవరాజు, సంజీవ్ రాజు, అనంతపల్లి సతీష్ కుమార్, కొల్లి దుర్గాప్రసాద్ , మహమ్మద్ లతీఫ్, నెల్లూరి హర్ష, నెక్కల భుజంగరావు , మార్ని శివ, పెదిరెడ్డి నరేష్, కౌన్సిలర్ దుర్గాభవాని, లోవరాజు తదితరులు పాల్గొన్నారు







