Vaishnavi Chaitanya : సినిమా రిలీజ్ అవ్వకుండానే హీరోయిన్ గా మూడు సినిమాల ఛాన్స్ కొట్టేసిన తెలుగమ్మాయి..

UPDATED 22nd NOVEMBER 2022 TUESDAY 8:55 AM

Vaishnavi Chaitanya : షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలుపెట్టిన వైష్ణవి చైతన్య ఆ తర్వాత యూట్యూబ్ వెబ్ సిరీస్ లతో మరింత పాపులర్ అయింది. షార్ట్ ఫిలిమ్స్ సమయంలోనే తన నటనకి, అందానికి అంతా ఫిదా అయ్యారు. సిరీస్ లు చేస్తున్న సమయంలోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది. అల్లు అర్జున్, నాని, అజిత్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో వైష్ణవి చైతన్య నటించి మెప్పించింది.

తెలుగమ్మాయి కావడంతో, బాగా నటించడం, చూడటానికి బాగుండటంతో వైష్ణవికి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తూనే ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా కలర్ ఫోటో నిర్మాత సాయి రాజేష్ డైరెక్టర్ గా తెరకెక్కుతున్న ‘బేబీ’ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. డైరెక్టర్ మారుతి, SKN ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టిజర్ రిలీజ్ అయింది.

బేబీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత SKN మాట్లాడుతూ.. ”మన ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలు చాలా తక్కువమంది ఉన్నారు. తెలుగమ్మాయిలు సెట్ లో ఉంటే వర్క్ ఇంకా ఫాస్ట్ గా జరుగుతుంది. వైష్ణవి చైతన్య చాలా బాగా నటిస్తుంది. కళ్ళతోనే యాక్ట్ చేయగలదు. ఈ సినిమాలో తన నటనతో అందర్నీ మెప్పిస్తుంది. కేవలం తన ఎక్స్ ప్రెషన్స్ నచ్చి తనతో ఇంకో మూడు సినిమాలు సైన్ చేయించుకున్నాను. భవిష్యత్తులో వైష్ణవి చైతన్య స్టార్ హీరోయిన్ అవుతుంది” అని తెలిపారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us