జడ్పీ సీఈవోగా గోవిందరావు బాధ్యతల స్వీకరణ

UPDATED 25th NOVEMBER 2017 SATURDAY 900 PM

కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా పరిషత్‌ మఖ్య కార్యనిర్వాహణాధికారి(సీఈవో)గా రోణంకి గోవిందరావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. విజయనగరం జిల్లా పార్వతీపురం ఆర్డీవోగా పనిచేసిన ఆయన ఇక్కడకు బదిలీపై వచ్చారు. బాధ్యతలు స్వీకరించేముందు మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్‌ కార్తికేయమిశ్రాను కలిశారు. 2012లో గోవిందరావు గ్రూప్‌-1లో మూడో ర్యాంకు సాధించారు. తొలుత పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు ఆర్డీవోగా విధుల్లో చేరారు. తొలుత ఈయన జిల్లాలోనే గ్రూప్‌-1 అధికారిగా శిక్షణ పొందారు. 2012 మే 7 నుంచి 2013 సెప్టెంబరు 13 వరకూ గోవిందరావు జిల్లాలో శిక్షణ పొందారు. అందులో భాగంగా జడ్పీలో కూడా పనిచేశారు. గ్రూప్‌-1కు ఎంపికయ్యేమందు 11 సంవత్సరాల పాటు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఈ సందర్భంగా గోవిందరావు మాట్లాడుతూ అతిపెద్ద జిల్లాలో జడ్పీ సీఈవోగా అవకాశం రావటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో జిల్లాను అభివృద్ధి పథం వైపు నడిపిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కార్యాలయ ఉద్యోగులు సీఈవోను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us