Ap News: పీఆర్‌సీ ప్రకటించినా ఉద్యమాన్ని విరమించేది లేదు: ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు

విజయవాడ (రెడ్ బీ న్యూస్) 10 డిసెంబర్ 2021: సీపీఎస్‌ రద్దు బాధ్యత ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదేనని ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు తెలిపారు. సీపీఎస్‌ రద్దు కాకుండా ప్రత్యామ్నాయాలు అవసరం లేదన్నారు. విజయవాడలో ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ.. ‘‘ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేయాలి. మొత్తంగా పెండింగ్‌లో ఉన్న 7 డీఏల బకాయిలు వెంటనే విడుదల చేయాలి. ఆదర్శ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు కూడా పీఆర్‌సీ ప్రకటించాలి. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, అంగన్వాడీలకు జీతాలు పెంచాలి. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకూ వెంటనే పీఆర్‌సీ ప్రకటించాలి. పీఆర్‌సీతో పాటు నాన్‌ ఫైనాన్షియల్‌ డిమాండ్లను వెంటనే పరిష్కరించే విధంగా సీఎం జగన్‌ చొరవ తీసుకోవాలి. పీఆర్‌సీ ప్రకటించినా ఉద్యమాన్ని విరమించేది లేదు. రెండో దశ ఉద్యమ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తాం. ఇప్పటివకే ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తాలూకాల్లో నిరసన ర్యాలీలు చేపడతాం. సీఎంపై ఉన్న గౌరవంతో మూడేళ్లు ఎదురుచూశాం. హామీలు నెరవేర్చే వరకూ ఉద్యమం ఆపేది లేదు. ఉద్యోగులంతా ఉద్యమానికి సహకరించాలి’’ అని అన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us