బిందుసేద్యం పై రైతులకు అవగాహన పెంచాలి

UPDATED 18th AUGUST 2017 FRIDAY 6:00 PM

పెద్దాపురం: బిందు సేద్యం పథకంపై రైతులకు మరింత అవగాహన కలిగించేలా కృషి చేయాలని ఆర్డీవో వి. విశ్వేశ్వరరావు అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో మైక్రో ఇరిగేషన్ పిడి టి.వి. సుబ్బారావుతో కలిసి డివిజన్లోని తహసీల్దార్లు, హార్టికల్చర్, నవభారత్ ప్రతినిధులుతో కలిసి ఈ పథకంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో విశ్వేశ్వరరావు మాట్లాడుతూ డివిజన్లో 17 వేల హెక్టార్ల సాగు భూమి ఉందని, ఈ సంవత్సరం అయితే రెండు వేల హెక్టార్లలో మాత్రమే బిందుసేద్యం ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారని, దీని నిమిత్తం ఇప్పటికే 1000 హెక్టార్ల భూమిని గుర్తించినట్లు పేర్కొన్నారు. తహసీల్దార్లు, ఉద్యానవన శాఖ, బిందుసేద్యం, విఆర్వోల సమన్వయంతో మండల, గ్రామ స్థాయిలో రైతులకు ఈ పథకంపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం మైక్రో ఇరిగేషన్ పిడి సుబ్బారావు మాట్లాడుతూ ఈ పథకం పెద్దాపురం డివిజన్లో అమలు చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని, అన్ని శాఖల అధికారుల సమన్వయముతో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. మైక్రో ఇరిగేషన్ పథకం ద్వారా ప్రభుత్వం రాయితీలను అందచేయడం జరుగుతోందని, ఎస్సీ, ఎస్టి రైతులకు నూరు శాతం, సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం, ఐదు నుంచి పది ఎకరాల వరకు 70 శాతం, పదెకరాల పైబడి 50 శాతం రాయితీలను ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నవభారత్ సుగర్స్ ప్రతినిధి ఎస్.వెంకటేశ్వరావు, ఆర్. సూర్యారావు, ఉద్యానవన శాఖాధికారి సిరిల్, ఎపిఎంఐపి ఏరియా ఇంచార్జి చిలకమ్మ తహసీల్దార్లు పాల్గొన్నారు.   

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us