UPDATED 30th MAY 2017 TUESDAY 5:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో ఈనెల 31 న క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కళాశాల వైస్ ఛైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మంగళవారం మాట్లాడారు. దేశవ్యాప్తంగా 13 ప్రముఖ కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఈ ఇంటర్వ్యూలకు హాజరు అవుతారని ఆయన పేర్కొన్నారు. ఇంజనీరింగ్, ఎంబీఏ , ఎంసీఏ, ఫార్మసీ, ఏదైనా డిగ్రీ చదివి 2017లో ఉత్తీర్ణులైన వారు అర్హులని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఎవరైనా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఎంపికైన ఉద్యోగార్థులకు రూ.1.5 లక్షల నుంచి రూ.2.5 లక్షల వార్షిక వేతనం లభిస్తుందన్నారు. విద్యార్థుల అభివృద్ధే ధ్యేయంగా ఆదిత్య విద్యాసంస్థలు అహర్నిశలు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మెగా క్యాంపస్ డ్రైవ్ లో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ఉద్యోగావకాశాలు పొందాలని ఆయన ఆకాంక్షించారు.







