Crime News: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం

UPDATED 17th MAY 2022 TUESDAY 07:40 PM

Prakasam Road Accident : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిప్పాయపాలెం గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు మంటల్లో చిక్కుకుని సజీవ దహనం అయ్యారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు.

అయితే కారు నెంబర్ ప్లేట్ కూడా మంటల్లో కాలిపోవడంతో సజీవ దహనం అయిన వారి వివరాలు గుర్తించడానికి ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత విచారణలో కారు నెంబర్ తో పాటు సజీవ దహనం అయిన వారి వివరాలు పోలీసులు కనుగొన్నారు. ఆ కారు కడప జిల్లా బాదరావుపేటకు చెందినదిగా పోలీసుల గుర్తించారు. కారు నెంబర్ AP39DE 6450. కారు మార్కాపురం హైవే నుండి కంభంవైపుగా వెళ్తోంది. కర్నాటకకు చెందిన లారీ విజయవాడ వైపు వెళ్తోంది. లారీ నెంబర్ KA14C2949.

స్పీడ్ గా వెళ్తున్న కారు టైర్ పేలిపోయింది. దీంతో ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు మూడు పల్టీలు కొట్టింది. కారు నుజ్జు నుజ్జు అయ్యింది. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అందులోనే చిక్కుకున్నారు. కారులోని పెట్రోల్ రోడ్డు మీద పడింది. రోడ్డుకు, కారుకు రాపిడి జరిగి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు వ్యాపించాయి. కారులో చిక్కుకున్న వారు బయటకు వచ్చే మార్గం లేకపోయింది. మంటలు చెలరేగడంతో కారులోనే ఆ ముగ్గురు సజీవ దహనం అయ్యారు. ఈ ప్రమాదం జరిగాక లారీ డ్రైవర్ పరార్ అయ్యాడు. లారీ నెంబర్ ఆధారంగా దాని ఓనర్ ని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us