Southern Railway: రైళ్లలో ప్రయాణించాలంటే.. టీకా సర్టిఫికెట్ తప్పనిసరి!

చెన్నై (రెడ్ బీ న్యూస్) 8 జనవరి 2022 : తమిళనాడులో కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో దక్షిణ రైల్వే కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా టీకా రెండు డోసులు తీసుకున్నవారికి మాత్రమే రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతిస్తామని వెల్లడించింది. కౌంటర్ వద్ద కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ చూపించినవారికే టికెట్ అందిస్తామని అధికారులు ఈ మేరకు స్పష్టంచేశారు. జనవరి 10 నుంచి 31వ తేదీ వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఒమిక్రాన్ కేసులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అంతేకాక దక్షిణ జోన్ లోని రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో మాస్కు లేకుండా కనిపిస్తే రూ. 500 జరిమానా విధిస్తామని రైల్వే జోన్ హెచ్చరికలు జారీ చేసింది. ప్రయాణికులు కొవిడ్ నిబంధనలను తప్పక పాటించాలని సూచించింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా దక్షిణ రైల్వే జనవరి 6 నుంచే పలు రకాల ఆంక్షలను విధిస్తూ వస్తోంది. రైళ్లను 50 శాతం సీటింగ్ సామర్థ్యంతోనే నడుపుతోంది. గడిచిన 24 గంటల్లో తమిళనాడులో కొత్తగా 8,981 మందికి పాజిటివ్ గా తేలింది. మహమ్మారితో మరో 8 మంది మృతిచెందారు. కాగా మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 27,76,418కు చేరింది. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 36,888కు చేరింది. తమిళనాడులో ఇప్పటివరకు 121 మందికి ఒమిక్రాన్ గా నిర్ధరణ అయింది. ఇందులో 117 మంది కోలుకున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us