UPDATED 14th DECEMBER 2017 THURSDAY 6:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో గ్రంథాలయ విభాగం ఆధ్వర్యంలో జాతీయ శక్తి పరిరక్షణ దినోత్సవం (నేషనల్ ఎనర్జీ కన్సర్వేషన్ డే) వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్&డి హెడ్ డాక్టర్ కె.వి.ఎస్.ఆర్.మూర్తి హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం ప్రతీ సంవత్సరం డిసెంబర్ 14న జాతీయ శక్తి పరిరక్షణ దినోత్సవం గా గుర్తించి ప్రజలలో అవగాహన కల్పిస్తోందన్నారు. మనకు శక్తి గాలి, నీరు, బొగ్గు, సూర్యరశ్మి, పెట్రోల్. డీజిల్, మొదలనవి అధిక ఉత్పాదక వ్యయంతో సహజవనరుల వినియోగం ద్వారా లభిస్తోందని, నేడు పొదుపు చేసిన శక్తి భావితరాల వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రికల్ వాహనాలు వాడకం అధికమవుతుందని, భవిష్యత్తులో శక్తి యొక్క వినియోగం దృష్ట్యా నేడు పొదుపుగా వాడుకోవాలన్నారు. అనంతరం క్యాంపస్ లో గల ఇంజనీరింగ్, ఫార్మసీ, బిజినెస్ మేనేజ్మెంట్, పాలిటెక్నిక్, ఫోరెన్సిక్ సైన్స్ కళాశాలల విద్యార్థులకు వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. వక్తృత్వ పోటీల్లో ఎం. శ్రీనివాస సుబ్రహ్మణ్యం (సి.ఎస్.ఈ), ఎస్. గాయత్రి (ఈ.సి.ఈ), సి.హెచ్.తేజస్వని (సివిల్), చిత్రలేఖనంలో బి.ఎస్.ఎల్.ఎస్. హారిక (ఈ.సి.ఈ), డి.ఖ్యాతిశ్రీ (ఈ.సి.ఈ), సి.లేఖనాచౌదరి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజేతలుగా ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయాధికారి కె.అశోక్ కుమార్, సిబ్బంది సి.హెచ్.వేణు, కె.నాగబాబు, కె.సోమరాజు తదితరులు పాల్గొన్నారు.







