నవ నిర్మాణ దీక్షను విజయవంతం చేయాలి

UPDATED 1st JUNE 2017 THURSDAY 6:00 PM

పెద్దాపురం: నవ నిర్మాణ దీక్షా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆర్డీవో వి. విశ్వేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో నియోజకవర్గ స్థాయి నవనిర్మాణ దీక్షా కార్యక్రమ నిర్వహణ పై స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖలకు చెందిన అధికారులతో ఆర్డీవో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన మూడు సంవత్సరాల నుంచి జూన్ రెండవ తేదీన రాష్ట్ర విభజన దినోత్సవాన్ని నవ నిర్మాణ దినోత్సవంగా పాటిస్తూ వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా  నవ నిర్మాణ దీక్షా కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు. జూన్ రెండవ తేదీ నుంచి 8వ తేదీ వరకు నవ నిర్మాణ దీక్షా కార్యక్రమం స్థానిక రామారావుపేటలో ఉన్న బ్రాహ్మణ కల్యాణమండపంలో జరుగుతుందన్నారు. దీనిలో భాగంగా రెండవ తేదీన నవ నిర్మాణ ర్యాలీ, ప్రతిజ్ఞ , మూడున రాష్ట్ర విభజన చట్టం హామీల అమలు పై చేర్చలు, నాలుగున వ్యవసాయం, అనుబంధ విభాగాలు, నీటి యాజమాన్యం పై చేర్చ, ఐదున ఎస్.సి, ఎస్.టి, బి.సి, కాపు, మైనారిటీ సంక్షేమం పై చేర్చలు, ఆరున మానవ వనరుల అభివృద్ధి, పరిశ్రమల స్థాపన పై చేర్చ, ఏడున సామాజిక వికాసం, కుటుంబ వికాసం, ఎనిమిదిన మహా సంకల్ప కార్యక్రమం జరుగుతుందన్నారు. అనంతరం ఎఎంసి చైర్మన్ ముత్యాల వీరభద్రరావు (రాజబ్బాయి), పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చర్యలు చేపట్టారని దీన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం, సామర్లకోట మున్సిపల్ కమీషనర్లు బి.ఆర్.శేషాద్రి, సి. వెంకటేశ్వరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ కొరుపూరి రాజు, తహసీల్దార్లు గోగుల వరహాలయ్య, శివకుమార్, ఎంపిడివోలు వసంత మాధవి, నాగేశ్వరరావు, మన్యం చంద్రరావు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.  
 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us