TS News: హైదరాబాద్‌ నగర కమిషనర్‌గా సీవీ ఆనంద్

హైదరాబాద్‌ (రెడ్ బీ న్యూస్) 25 డిసెంబర్ 2021: హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా సీవీ ఆనంద్‌ నియమితులయ్యారు. ఈ స్థానంలో ఉన్న అంజనీకుమార్‌ ఏసీబీ (అవినీతి నిరోధకశాఖ)డీజీగా బదిలీ అయ్యారు. తెలంగాణలో భారీఎత్తున ఐపీఎస్‌ అధికారులను బదిలీలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 30 మందికి స్థానచలనమైంది. హైదరాబాద్‌ కమిషనర్‌, సీనియర్‌ ఐపీఎస్‌లతో పాటు పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీల బదిలీలు సైతం జరిగాయి. సీనియర్‌ ఐపీఎస్‌లతో పాటు సిద్దిపేట, నిజామాబాద్‌ పోలీసు కమిషనర్లు, 11 జిల్లాల ఎస్పీల బదిలీలను ప్రభుత్వం చేపట్టింది. నారాయణపేట ఎస్పీ చేతనకు పోస్టింగు ఇవ్వలేదు. ఒకటిరెండు రోజుల్లో మరిన్ని బదిలీలు జరిగే అవకాశం ఉంది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us