UPDATED 4th JUNE 2017 SUNDAY 8:00 PM
అన్నవరం : అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం అట్టహాసంగా జరిగింది. ప్రభుత్వం నియమించిన 16 మంది సభ్యులతో దేవస్థానం ప్రాంగణంలో సాయంత్రం దేవాదాయశాఖ ఇన్‌ఛార్జి ఉప కమిషనర్ రమేష్‌బాబు ప్రమాణ స్వీకారం చేయించారు. దేవస్థానం ఛైర్మన్‌గా రాజా ఇనుగంటి వెంకటరోహిత్, సభ్యులుగా రావిపాటి సత్యనారాయణ (గుంటూరు), పర్వత గుర్రాజు (శంఖవరం), యనమల రాజేశ్వరరావు (తొండంగి మండలం ఏవి నగరం), యడ్ల బేతాళుడు (తొండంగి మండలం వలసపాకల), అవసరాల వీర్రాజు (మండపేట), కందుల విశ్వేశ్వరరావు (పెద్దాపురం మండలం జె.తిమ్మాపురం), నున్న రామచంద్రరావు (రామచంద్రపురం), చెల్లి శేషకుమారి (ఐ.పోలవరం మండలం పాతఇంజరం), కొత్త వెంకటేశ్వరరావు (జగ్గంపేట), సత్తి దేవదానరెడ్డి (అనపర్తి మండలం పొలమూరు), రొబ్బి విజయశేఖర్ (రాజమహేంద్రవరం), సింగిల్‌దేవి సత్తిరాజు (ప్రత్తిపాడు), మారెడ్డి సింగారెడ్డి (విశాఖపట్నం), మట్టే సత్యప్రసాద్ (పెద్దాపురం), ఎక్స్‌అఫీషియో సభ్యునిగా దేవస్థానం ప్రధానార్చకులు కొండవీటి సత్యనారాయణ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, జ్యోతుల నెహ్రూ, వేగుళ్ల జోగేశ్వరరావు, నల్లమల్లి రామకృష్ణారెడ్డి, తోట త్రిమూర్తులు, దాట్ల సుబ్బరాజు, డీసీసీబీ ఛైర్మన్ వరుపుల రాజా, జిల్లా పరిషత్ ఛైర్మన్ నామన రాంబాబు, గుడా ఛైర్మన్ గన్నికృష్ణ, బిజెపి జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య, జాతీయ ఉద్యానబోర్డు సభ్యుడు చోడ్రాజు సత్యకృష్ణంరాజు, తుని మార్కెట్ కమిటీ చైర్మన్ యనమల కృష్ణుడు తదితరులు హాజరై దేవస్థానం అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు సమిష్టిగా కృషిచేయాలని సభ్యులకు సూచించారు. దేవస్థానం అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వారన్నారు. ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకారం రెండు విడతలుగా జరిగింది. ఈ సందర్భంగా హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ దేవస్థానంలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోందని, అలాగే దేవస్థానం ఆధ్వర్యంలో యూనివర్సిటీ ఏర్పాటు చేసేవిధంగా అంతా కృషిచేయాలని, రాజకీయ పదవులు వేరు, దేవాలయాల్లో పదవులు వేరని ఇది దృష్టిలో ఉంచుకుని అంతా నడుచుకోవాలని అన్నారు. ప్రమాణ స్వీకార మహోత్సవం అనంతరం సత్యదేవుని దర్శించుకున్నారు.







