గుడ్లవల్లేరు (రెడ్ బీ న్యూస్) 14 జనవరి 2022 : కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మెగాస్టార్ చిరంజీవి దంపతులు దర్శించుకున్నారు. మెగా ఇంజినీరింగ్ సంస్థ ఆహ్వానం మేరకు... ఆలయం వద్దకు చేరుకున్న చిరంజీవి దంపతులకు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దేవస్థానం ప్రాంగణంలోని ఆంజనేయ స్వామిని దర్శించుకుని గోదాదేవి కల్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. మెగా ఇంజినీరింగ్ మేనేజింగ్ డైరెక్టర్లు పీపీ రెడ్డి, కృష్ణా రెడ్డి, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తదితరులు గోదాదేవి కల్యాణ వేడుకల్లో పాల్గొన్నారు.