UPDATED 12th JUNE 2017 MONDAY 3:30 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో రీసెంట్ ట్రెండ్ ఇన్ సోలార్ ఎనర్జీ అనే అంశంపై ఒక రోజు వర్క్ షాప్ ను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చెన్నై జెరూసలేం యూనివర్సిటీకి చెందిన డీన్ డాక్టర్ ఎస్.రామారెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకూ పెరిగిపోతున్న అధిక విద్యుత్ వినియోగం, తగ్గిపొతున్న సహజ వనరులు మొదలయిన వాటిని మనం రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే రాబోయే రోజుల్లో మనుగడ కష్టతరమని సూచించారు. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రత్యామ్నాయంగా సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెంచాలన్నారు. ఆ దిశగా ప్రతీ ఒక్కరూ ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమయ్యిందన్నారు . అనంతరం స్టాండ్ అలోన్ పీవీ సిస్టం, గ్రిడ్ కనెక్టెడ్, నెట్ మీటరింగ్, డిఫరెంట్ బక్, బూస్ట్ కన్వెర్టర్ అండ్ ఇన్వెర్టర్ టెక్నాలజీస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లోస్డ్ లూప్ కంట్రోల్ మెకానిజం వంటి రీసెంట్ ట్రెండ్ సోలార్ ఎనర్జీ గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.శ్రీనివాస్, హెచ్ఓడీలు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







