TTD: ఈ నెల 12న తిరుమల శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

UPDATED 9th JULY 2022 SATURDAY 07:10 PM

TTD : తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 12న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. 11న వీఐపీ బ్రేక్‌ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవని పేర్కొంది.

17న ఆణివార అస్థానం నేపథ్యంలో శ్రీ‌వారి ఆలయంలో 12న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. తిరుమలలో టైమ్‌స్లాట్‌ దర్శన విధానాన్ని తిరిగి ప్రారంభిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు.

ఈనెల 11 న నిర్వహించే పాలకమండలిలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. భక్తులకు సులువుగా దర్శనం కల్పించేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబరులోగా కలకంబాడి రోడ్డు, డిసెంబరులోగా శ్రీనివాస సేతు రోడ్డు మార్గాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. నిన్న శ్రీ వేంకటేశ్వరస్వామిని 73, 016 మంది భక్తులు దర్శించుకోగా 37,068 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4,09 కోట్లు వచ్చిందని వివరించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us