ఆక్వా దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి

* జిల్లా కలక్టర్ మురళీధర్ రెడ్డి

UPDATED 31st JULY 2020 FRIDAY 7:00 PM

కాకినాడ (రెడ్ బీ న్యూస్): జిల్లాలో ఆక్వా అనుమతుల కోసం పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలక్టర్ డి. మురళీధర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ కార్యాలయం నుంచి మత్స్య శాఖ ఆక్వా రెగ్యూలేటరీ కమిటీ జిల్లా స్థాయి సమావేశం కలక్టర్ అధ్యక్షతన శుక్రవారం జూమ్ యాప్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా కలక్టర్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా స్థాయిలో ఉన్న 1316 దరఖాస్తులపై తక్షణమే చర్యలు తీసుకుని, అనంతరం జిల్లా స్థాయి కమిటీ ముందు ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా స్థాయిలో వచ్చిన 255 దరఖాస్తులు క్రమబద్దీకరణ, రిజిస్ట్రేషన్ పత్రాలు జారీకి కమిటీ ఆమోదం తెలిపిందని,  ఇందులో 654.20 ఎకరాల్లో 204 మంచినీటి చెరువులకు, 42.77 హెక్టార్లలో 51 బ్రాకిష్ వాటర్ చెరువులకు కొత్తగా కమిటీ ఆమోదించిందని తెలిపారు. కోవిడ్ కారణంగా జిల్లాలో ఉన్న 15 ప్రొసెసింగ్ యూనిట్లకు సిబ్బంది సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రొసెసింగ్ యాజమాన్యాలు బయట నుంచి వచ్చే వర్కర్లకు తప్పనిసరిగా కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని, పాజిటీవ్ కేసులు నమోదైతే వారికి తక్షణమే వైద్య సదుపాయాలు కల్పించాలని అన్నారు. వివిధ కంపెనీలు కొనుగోలు చేస్తున్న రేట్లను ఎప్పటికప్పుడు గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా ఆక్వా రైతులకు తెలియచేయాలని, అలాగే లేబర్ సమస్యతో ఏ యూనిట్ మూత పడకుండా ఆక్వా ప్రొసెసింగ్ యూనిట్లు నిరంతరం పని చేసేలా అన్ని చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలక్టర్ (ఆర్) డాక్టర్ జి. లక్ష్మీశ, మత్స్య శాఖ సంయుక్త సంచాలకులు పి. కోటేశ్వరరావు, వ్యవసాయ శాఖ డిడి వి.టి. రామారావు, పోల్యూషన్ ఇంజనీరు సిహెచ్.వి. సూర్యారావు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us