UPDATED 5th FEBRUARY 2018 MONDAY 6:30 PM
పెద్దాపురం : తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణంలో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయని గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు రంగనాధం శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ సంధర్భంగా ఆయన స్థానిక విలేఖరులతో సోమవారం మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్ నూనె రామారావు మరుగుదొడ్లు నిర్మాణాలు చేపడుతున్నాడని, అంతేకాక ఒక్కొక్క లబ్ధిదారుని నుంచి రూ.1500 నుంచి రూ.2000 వరకు అక్రమంగా వసూలు చేస్తున్నాడన్నారు. గత నెల గ్రామంలో నిర్వహించిన జన్మభూమి సదస్సులో ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇంతవరకు ఏవిధమైన చర్యలు తీసుకోలేదన్నారు. ఈ విషయంఫై తహసీల్దార్ గోగుల వరహాలయ్యకు ఫిర్యాదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.







