AP News:నన్ను చంపేందుకు రెక్కీ నిర్వహించారు: వంగవీటి రాధా

గుడ్లవల్లేరు (రెడ్ బీ న్యూస్) 26 డిసెంబర్ 2021: తనను చంపడానికి కొందరు రెక్కీ నిర్వహించారని మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు చేశారు. గుడ్లవల్లేరు మండలం చిన్నగొన్నూరు గ్రామంలో ఏర్పాటు చేసిన వంగవీటి రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, రాధా పాల్గొన్నారు. ముగ్గురు నేతలు కలిసి రంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రాధా ఉద్వేగ భరితంగా ప్రసంగించారు. ‘‘నన్ను చంపడానికి కొందరు రెక్కీ నిర్వహించారు. నన్ను ఏదో చేద్దాం అనుకునే వారిని చూసి భయపడను. దేనికైనా సిద్ధమే. ప్రజల మధ్యే తిరుగుతా. వంగవీటి రాధా లేకుండా చేయాలనుకునే వారిని ప్రజలు దూరం పెట్టాలి’’ అని పేర్కొన్నారు. రాధా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. ఎవరినుద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనేదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us