అపోలో ఆసుపత్రి లో కార్డియాక్ క్యాథ్ ల్యాబ్, సిటీ స్కాన్ ప్రారంభం

UPDATED 13th JUNE 2017 TUESDAY 5:00 PM 

కాకినాడ: స్థానిక అపోలో ఆసుపత్రి లో రూ.4.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన జర్మన్ టెక్నాలజీ తో రూపొందించిన అత్యాధునిక కార్డియాక్ క్యాథ్ ల్యాబ్, అలాగే రూ.3.50 కోట్లతో కొనుగోలు చేసిన 32 స్ట్రెస్ సిటి స్కాన్ వైద్య సేవలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసరావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక వైద్యం ఇప్పుడు అపోలో ఆసుపత్రిలో ప్రజలకు అందరికి అందుబాటులోకి తీసుకురావడం పై ఆయన హర్షం వ్యక్తం చేశారు. గుండె, కిడ్నీ, మెదడు, ఎముకలకు సంబంధించిన ఆపరేషన్స్ లను సులువుగా నిర్వహించేందుకు ఈ అత్యాధునిక పరికరాలు దోహదపడతాయన్నారు. అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ఖరీదైన వైద్యాన్ని అపోలో ఆసుపత్రి అందించడం పై సంస్థ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. అనంతరం ఆసుపత్రి సీఈవో డాక్టర్ సందీప్ మాట్లాడుతూ కార్డియాక్ ల్యాబ్ తో మెదడుకు చికిత్స, యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ వంటి ఆధునిక చికిత్సా విధానాలను మెరుగైన రీతిలో వైద్యం అందచేయడానికి వీలవుతుందని పేర్కొన్నారు. గుండెకు స్టంట్ లు అమర్చే క్రమంలో అనువైన సాఫ్ట్ వేర్ ఈ పరికరాల్లో ఉన్నాయన్నారు. అనంతరం ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ, ఎంప్లాయిస్ హెల్త్ స్కీం, జర్నలిస్ట్ హెల్త్ స్కీం, ఆరోగ్య రక్ష కార్యక్రమాలను మంత్రితో పాటు కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం , శాసన సభ్యులు వనమాడి వెంకటేశ్వరావు( కొండబాబు) , పిల్లి అనంత లక్ష్మి, దాట్ల బుచ్చిబాబు, ఎస్.వి.ఎస్. వర్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అపోలో ఆసుపత్రి ఈవో ఐ.వి.రమణ, కార్పొరేట్ రిలేషన్స్ మేనేజర్ జి.వి.ఆర్. మూర్తి, ఎన్టీఆర్ వైద్య సేవ కో-ఆర్డినేటర్ వర ప్రసాద్, అపోలో సిబ్బంది పాల్గొన్నారు.               
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us