గైట్‌లో సినీ సందడి

UPDATED 5th SEPTEMBER 2017 TUESDAY 8:00 PM

రాజానగరం: ప్రముఖ హీరో, హీరోయిన్లు నాగచైతన్య, లావణ్యత్రిపాఠి స్థానిక గైట్‌ ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం సందడి చేశారు. యుద్ధం శరణం మూవీ  ప్రమోషన్‌ లో భాగంగా వారు విశాఖపట్నం నుంచి నేరుగా ఇక్కడికి వచ్చారు. వీరిని చూసేందుకు, సెల్ఫీలు దిగేందుకు విద్యార్థులు ఎగబడ్డారు. అనంతరం నాగచైతన్య మాట్లాడుతూ యువత తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, తాము నటించిన ‘యుద్ధం శరణం’ మూవీ పల్లెటూరి నేపథ్యంలోని కుటుంబ కథా చిత్రమన్నారు. ప్రేమ, ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు యాక్షన్‌ థ్రిల్లర్‌తో కూడి ఉంటుందని, ఈ నెల ఎనిమిదిన ఈ మూవీ విడుదల అవుతోందన్నారు. ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలని నాగచైతన్య, లావణ్య త్రిపాఠి కోరారు. విద్యార్థులకు చిత్ర యూనిట్ టీషర్టులు, రబ్బరు బ్యాండ్లు పంపిణీ చేసింది. చైతన్య విద్యా సంస్థల ఛైర్మన్‌ కె.వి.వి.సత్యనారాయణరాజు నాగచైతన్య, లావణ్యత్రిపాఠిలకు జ్ఞాపికలు అందజేశారు. ఈ  కార్యక్రమంలో కళాశాల ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కె.లక్ష్మీశశివర్మ, జనరల్‌ మేనేజర్‌ డా.పి.సుబ్బరాజు, సీఈవో డా.డి.ఎల్‌.ఎన్‌ రాజు, డీజీఎమ్‌ ఎ.నరేష్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us