UPDATED 10th NOVEMBER 2017 FRIDAY 7:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ విభాగం సిబ్బందికి నూతన ఆవిష్కరణలపై అవగాహన కల్పించేందుకు రెండు రోజులు వర్క్ షాప్ నిర్వహించినట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. వేగంగా మారుతున్న విజ్ఞానం, ప్రపంచంలో నిరంతరం జరుగుతున్న విప్లవాత్మకమైన నూతన ఆవిష్కరణల పట్ల అధ్యాపకులు సరైన అవగాహన కలిగివున్నపుడే విద్యార్థులకు మెరుగైన సమాచారం అందించగల రన్నారు. ప్రతీ సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షల అనంతరం రెండవ సెమిస్టర్ కు చెందిన పాఠ్యాంశాల పైన సరైన అవగాహన కోసం ఆయా విభాగాల సిబ్బందికి ఇటువంటి వర్క్ షాప్ ను అనుభవజ్ఞులచే నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే ఈ వర్క్ షాప్ కు ముఖ్య అతిథిగా ఢిల్లీకి చెందిన ఐఐటి ప్రొఫెసర్ డాక్టర్ శ్రీహరి హాజరై ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్స్ ఇన్ వెల్డింగ్ టెక్నాలజీ అనే అంశం పై పలు సూచనలు చేసారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్స్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, వైస్ ప్రిన్సిపాల్స్, మెకానికల్ విభాగాధిపతులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.







