UPDATED 30th MAY 2017 TUESDAY 4:30 PM
పెద్దాపురం: చెరువుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం అని హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక మరిడమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద ఉన్న మానోజీ చెరువును ఆయన మంగళవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మానోజీ చెరువును ఆధునీకరించి అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పటికే స్థానిక కొత్తపేట పెట్రోల్ బంక్ వద్ద ఉన్న చెరువును అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, టిడిపి పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రంధి సత్యనారాయణ, తూతిక రాజు, కౌన్సిలర్లు, టిడిపి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.







