సిపిఎస్‌ రద్దు చేసే వరకు పోరాటం

UPDATED 7th AUGUST 2018 TUESDAY 9:00 PM 

సామర్లకోట: ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు ఆశనిపాతంలా మారిన కంట్రిబ్యూటరీ పింఛన్ విధానం (సిపిఎస్)ను రద్దు చేసేంత వరకు పోరాటం కొనసాగిస్తామని ఎపి ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) నాయకులు అన్నారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో జరుగుతున్నసిపిఎస్ జాతా మంగళవారం సామర్లకోట చేరుకుంది. స్థానిక ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయం వద్ద నుంచి ర్యాలీగా రైల్వే స్టేషన్ సెంటర్ వరకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో నాయకులు షేక్ బాబ్జీ, గాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ సీపీఎస్‌ రద్దు చేయాలనేదే తమ ప్రధాన డిమాండ్‌గా పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని తెలియజేయాలని, సమస్య రాష్ట్ర పరిధిలోనిదా? కేంద్ర పరిధిలోనిదా? అనేది స్పష్టంగా చెప్పాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని, ఒకే పింఛను విధానాన్ని అమలు చేయాలని చెప్పారు. రాజకీయ నిర్ణయంతో తెచ్చిన నూతన పింఛను విధానం రాజకీయ నిర్ణయంతోనే రద్దు కావాలని, పాత పింఛను విధానాన్ని అమలుపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో యుటీఎఫ్, ఎస్టీయు, సిటియు నాయకులు రాఘవరావు, కామేశ్వరరావు, సత్యరాజు, వర్మ, పి. సుబ్బరాజు, డి. వెంకట్రావు, ఆర్. శ్రీనివాస్, సి.హెచ్. కరుణాకర్, మోర్త శ్రీనివాస్, ఎన్. అర్జున్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us