సామర్లకోటలో కూలిన వంతెన...లారీ బోల్తా..

సామర్లకోట:13 నవంబరు 2020 (రెడ్ బీ న్యూస్): తూర్పుగోదావరి జిల్లాలో ఓ వంతెన కూలిపోయింది. సామర్లకోట-పిఠాపురం రోడ్డు మార్గంలో ఏలేరు కాలువపై ఉన్న వంతెన కూలిపోయింది. అదే సమయంలో సామర్లకోట నుంచి పిఠాపురం వైపు గ్రావెల్ లోడుతో లారీ వెళ్తోంది. ఓ వైపు బ్రిడ్జి కూలిపోయి ఉండడంతో లారీ కాలువలోకి బోల్తా కొట్టింది. లారీ డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ఈ ప్రమాదంతో సామర్లకోట-పిఠాపురం మధ్య రాకపోకలు స్తంభించాయి. సామర్లకోట-పిఠాపురం మధ్య రాకపోకలు పూర్తిగా నిలిపివేసినట్లు తహశీల్దార్ జితేంద్ర తెలిపారు. ఆర్ అండ్ బీ అధికారులు పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని జితేంద్ర వెల్లడించారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us