ఆనందోత్సాహాలతో ఈదుల్ ఫితార్

UPDATED 26th JUNE 2017 MONDAY 6:00 PM

పెద్దాపురం: స్థానిక షాహీ జామియా మస్జిద్ ( పెద్ద మస్జిద్ )లో పట్టణ ముస్లిం సోదరులు ఘనంగా ఈదుల్ ఫితార్ నమాజ్ ను ఆచరించారు. మస్జిద్ ఇమాం అబ్దుల్ గఫ్ఫార్ ఖాన్ ఈద్ నమాజ్ చదివించారు. ముస్లిం అంజుమన్ వెల్ఫేర్ అస్సోసియేషన్, షాహీ జామియా మస్జిద్ కమిటీ ప్రెసిడెంట్ మొహమ్మద్ ముక్తార్ అలీ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో 30 రోజుల పాటు కఠిన ఉపవాసాలు, ప్రత్యేక ప్రార్ధనలు తరవీహ్ నమాజ్ లను, ఇఫ్తార్, సహర్ లను ఆచరించిన ప్రతి ముస్లిం సోదరునికి అభినందనలు తెలుపుతూ, ఇస్లాం మతం సోదర భావాన్ని, సమైక్యతను, శాంతిని కోరుకుంటుందని అన్నారు. ఈద్ నమాజ్ కు ముఖ్య అతిధిగా విచ్చేసిన పట్టణ మున్సిపల్ చైర్మన్ శ్రీ రాజసూరిబాబురాజు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ మస్జిద్ ల, నిరుపేద ముస్లింల అభ్యున్నతికి కృషి చేస్తూ, అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న ముస్లింల షాదిఖానా ను పూర్తి చేసి పట్టణ ముస్లిం సోదరులకు త్వరలోనే అందిస్తామని చైర్మన్ తెలిపారు. వందల సంఖ్యలో పాల్గొన్న ముస్లిం సోదరులు ఒకరికొకరు ఆలింగనం చేసుకొంటూ ఈద్ ముబారక్ తెలుపుకొన్నారు. ఈ వేడుకల్లో ఎండీ లాయఖ్ అలీ, ఎండీ ఆషిక్ అలీ, ఎండీ అబిద్ అలీ, ఎంవీ అలీ, జలీల్, ఇక్బాల్ ఖురేషి, ఎస్ ఏ నబి, జాకీర్, రిజ్వాన్, ఇర్షాద్, ఎండీ ఆరీఫ్, యువ ముస్లిం సోదరులు, పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి తూతిక రాజు, యూత్ ప్రెసిడెంట్ మార్ని శివ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us