UPDATED 28th FEBRUARY 2018 WEDNESDAY 7:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వేడుకలను క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి సర్ సి.వి. రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సర్ సి.వి.రామన్ భౌతిక శాస్త్రానికి చేసిన సేవలను వివరిస్తూ ఆయన భారత ప్రథమ నోబెల్ బహుమతి గ్రహీతని పేర్కొన్నారు. అలాగే బి.ఎస్.ఇ విభాగాధిపతి డాక్టర్ నరేంద్రుడు రామన్ ఎఫెక్ట్ గురించి విద్యార్థులకు వివరించారు. అలాగే గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు వకృత్వం, ప్రాజెక్ట్ ఎక్స్పో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతులు, గ్రంధాలయాధికారి కె. అశోక్ కుమార్, లైబ్రరీ సిబ్బంది సి.హెచ్. వేణు, నాగబాబు, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.







