సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

UPDATED 28th JUNE 2017 WEDNESDAY 6:00 PM

పెద్దాపురం : సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో వి.విశ్వేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆయన ఛాంబర్ లో బుధవారం మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాకాలం కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, దీనిపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. అలాగే డివిజన్ లో 12 మండలాల్లో 210 పంచాయతీలు, మూడు మున్సిపాలిటీలకు సంబంధించి ఆరోగ్య పరిస్థితిపై కంట్రోల్ రూమ్ ద్వారా సమీక్షిస్తున్నట్లు చెప్పారు. ఎక్కడైనా విష జ్వరాలు ప్రబలినా కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాలన్నారు. బ్లీచింగ్, ఫినాయిల్, అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. అలాగే పట్టణ పరిధిలో మురుగు కాలువలను శుభ్రం చేయించామన్నారు. 60 మెట్రిక్ టన్నుల చెత్తను తరలించడం జరిగిందన్నారు. దోమల నిర్మూలనకు ఫాగింగ్ చేయిస్తున్నట్లు చెప్పారు. ప్రతీ ఒక్కరు కాచి చల్లార్చిన నీటినే తాగాలని, నిలువ ఉన్న ఆహారాన్ని భుజించవద్దని, నీరు నిల్వ ఉండకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఆరోగ్య విషయంలో అనుమానం కలిగితే సమీపంలో ఆసుపత్రికి వెళ్లి వైద్య సహాయం పొందాలని సూచించారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us