అంగన్వాడీ పోస్టులకు ఇంటర్వ్యూలు

UPDATED 28th MAY 2018 MONDAY 6:30 PM

కాకినాడ: సామర్లకోట, తాళ్లరేవు ఐసిడిఎస్. ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ ఉద్యోగాలకు స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ఆర్డీవో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో ఎల్. రఘుబాబు మాట్లాడుతూ సామర్లకోట ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని 28 సెంటర్లకు సంబంధించి 28 అంగన్వాడీ సహాయకులకు, తాళ్ళరేవు పరిధిలో 26 అంగన్వాడీ సహాయ పోస్టులకు, ఏడు అంగన్వాడీ టీచర్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ ఐసిడిఎస్ ఎన్. సీతామహాలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్య శిక్షణా అధికారి డాక్టర్ కె. సత్యనారాయణ, సామర్లకోట ఐసిడిఎస్.ప్రాజెక్టు అధికారిణి టి.డి.ఆర్. పద్మావతి, తాళ్ళరేవు ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిణి సి.యస్. సరస్వతి, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us