ముంబయి (రెడ్ బీ న్యూస్) 9 డిసెంబర్ 2021: పవర్‌ఫుల్ కపుల్‌గా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ మొదటిస్థానంలో నిలిచారు.నూతన వధూవరులు, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్స్(ఐఐహెచ్‌బీ) దేశంలోని పవర్ కపుల్స్‌ను గుర్తించేందుకు సర్వే నిర్వహించింది. దానికి సంబంధించిన వివరాలను గురువారం ముంబయిలో విడుదల చేసింది. వీరికి 94 మార్కులు దక్కాయి. దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ 86 స్కోరుతో రెండో స్థానంలో నిలవగా.. 79 మార్కులతో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. దేశవ్యాప్తంగా 25 నుంచి 40 సంవత్సరాల వయస్సులో ఉన్న 1,362 మంది ఈ సర్వేలో పాల్గొన్నారని ఐఐహెచ్‌బీ వెల్లడించింది. ఈ సంస్థ 2019లో చివరిసారిగా పవర్ కపుల్ ర్యాంకులను విడుదల చేసింది. 2020లో కరోనా కారణంగా ఈ సర్వేకు దూరమైంది. ‘క్రితంసారి మేం వాణిజ్య రంగాలకు చెందిన జంటలను ఈ జాబితాలో చేర్చలేదు. కానీ మా బృందం అన్ని వర్గాలకు చెందిన జంటలను చేర్చాలని భావించింది. అందుకే ఈసారి వాణిజ్య వర్గానికి చెందిన జంటలకు చోటిచ్చాం’ అంటూ ఐఐహెచ్‌బీకి చెందిన చీఫ్ మెంటర్ సందీప్ గోయల్ వెల్లడించారు. నూతన వధూవరులు విక్కీ, కత్రినాలు తొమ్మిది స్థానంలో నిలవడం విశేషం.







