తాడికొండ (రెడ్ బీ న్యూస్) 9 డిసెంబర్ 2021: గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెలలో దారుణ ఘటన వెలుగుచూసింది. రెండు రోజుల పసిపాపను కన్నతల్లే చంపేసింది. ఆడపిల్ల పుట్టిందని బొంత లక్ష్మి అనే మహిళ ఈ దారుణానికి ఒడిగట్టింది. బిడ్డను చంపేసిన తర్వాత.. ఆరోగ్యం బాగాలేదంటూ ఆస్పత్రికి తీసుకెళ్లింది. వైద్య సిబ్బంది నిలదీయడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై వైద్య సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రావడానికి ముందే పాప మృతదేహాన్ని తల్లిదండ్రులు పూడ్చిపెట్టేశారు. మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేయించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. కుమార్తెను చంపేసిన దంపతులకు.. గతంలోనే ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.







