Corona Update: ఏపీలో మళ్లీ పెరిగిన కొవిడ్ కేసులు

Updated 1 February 2022 Tuesday 06:15 PM

అమరావతి (రెడ్ బీ న్యూస్): ఏపీలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. కొత్త కేసుల సంఖ్య భారీగా తగ్గింది. అయితే, సోమవారం నమోదైన కేసులతో పోలిస్తే.. ఇవాళ కొత్త కేసులు స్వల్పంగా పెరిగాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 6వేల 213 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మరో 5 మంది కరోనాతో చనిపోయారు. గడిచిన 24 గంటల్లో 10వేల 795 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,05,930 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 35,053 మందికి కోవిడ్ పరీక్షలు చేశారు. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 903 కేసులు వచ్చాయి. గుంటూరు జిల్లాలో 830 కేసులు, తూర్పుగోదావరి జిల్లాలో 731, కర్నూలు జిల్లాలో 679 కోవిడ్ కేసులు వెలుగుచూశాయి. కాగా, సోమవారం 5వేల 879 కరోనా కేసులు నమోదవగా, మంగళవారం ఆ సంఖ్య పెరిగింది.

మరోవైపు దేశవ్యాప్తంగానూ కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రోజువారీ కేసుల నమోదులో భారీ తగ్గుదల కనిపిస్తోంది. 2 లక్షల కంటే తక్కువగా రోజువారీ కేసులు నమోదయ్యాయి.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us