పాఠశాలల అభివృద్ధికి రాష్ట్ర పురపాలక శాఖ కృషి

UPDATED 17th MAY 2018 THURSDAY 9:00 PM

సామర్లకోట: పాఠశాలల అభివృద్ధికి రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక ప్రణాళికల ద్వారా కృషి చేస్తుందని మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ జి. నాగరాజు అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో గురువారం మున్సిపల్ పాఠశాలల ప్రగతిపై మున్సిపల్ కమీషనర్ సి.హెచ్. వెంకటేశ్వరరావుతో ఆర్డీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమీషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో గల నాలుగు ఉన్నత పాఠశాలల్లో బచ్చు ఫౌండేషన్ పాఠశాల నూరు శాతం ఉత్తీరతతో పాటు ఒక విద్యార్థి 10/10  జిపిఎ సాధించి ప్రథమస్థానంలో నిలిచిందన్నారు. అదేవిధంగా బి.బి.ఆర్. హైస్కూల్ నూరు శాతం ఫలితాలు సాధించగా, యార్లగడ్డ అక్కిరాజు హైస్కూల్ 98 శాతం ఉత్తీర్ణతతో పాటు ఇద్దరు విద్యార్థులు పదికి పది జిపిఎ సాధించినట్లు పేర్కొన్నారు. తోట గోపాలకృష్ణ మున్సిపల్ హైస్కూల్ 95 శాతం ఉత్తీర్ణత సాధించిందన్నారు. మున్సిపల్ పరిధిలో 9 జిపిఎ (గ్రేడ్ పాయింట్లు)ను మించి సాధించినవారు 42 మంది ఉన్నారని తెలిపారు. రాష్ట్రపతి అవార్డు గ్రహీత, ప్రధానోపాధ్యాయుడు తోటకూర సాయి రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులను శక్తివంతులుగా, విద్యావంతులుగా తయారుచేసి భావి భారత ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత ఉందని, ప్రతీ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ పాఠశాల విద్యను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పదికి పది జిపిఎ పాయింట్లు సాధించిన విద్యార్థిని పొన్నగంటి శ్రీలక్ష్మి మృదులను రీజినల్ డైరెక్టర్ అబినందించి జ్ఞాపికను అందచేశారు. అలాగే ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేసిన హెచ్ఎం సాయిరామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావును రీజనల్ డైరెక్టర్ జ్ఞాపికలు అందచేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో డిఇ ప్రభాకర్, గాంధీ, ప్రసాద్‌, లాయర్ సుధీర్, విద్యార్థిని మృదుల తండ్రి శ్రీనివాస్, కోడూరి శివ మాష్టారు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us