UPDATED 31st AUGUST 2022 WEDNESDAY 10:10 PM
Sharukh Khan: ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినాయకుడి నామస్మరణ మారుమోగుతోంది. భక్తిశ్రద్ధలతో వివిధ రూపాల్లో విఘ్నేశ్వరుడు కొలువుదీరాడు. వీధి వీధినా.. వాడవాడలా గణేష్ మండపాలు వేలిశాయి. వినాయక చవితితో దేశమొత్తం ప్రత్యేక శోభను సంతరించుకుంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తన ఇంట్లో వినాయకుడిని ప్రతిష్టించి మతసామరస్యాన్ని ఘనంగా చాటారు.
బుధవారం వినాయక చవితి సందర్భంగా గణేష్ ప్రతిమను ప్రతిష్టించి.. పూజలు జరిపారు. దీనికి సంబంధించిన ఫొటోను షారుఖ్ తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేస్తూ.. ‘గణపతిజీ.. నన్ను.. నా లిటిల్ వన్(చిన్న కుమారుడు)ను ఇంట్లోకి ఆహ్వానించారు. కృషి, పట్టుదలతో పాటు దేవుడిపై నమ్మకంతో మీరు అనుకున్నది సాధించవచ్చు.. అందరికి గణేష్ చతుర్థి శుభాకాంక్షలు’ అంటూ పేర్కొన్నారు.
ప్రస్తుతం షారుఖ్ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన గణపతి ఫొటో పోస్టు చేసిన కొద్ది నిమిషాల్లోనే కొన్ని లక్షల మంది లైక్ చేశారు. ఇక సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే షారుఖ్ ఖాన్ అన్ని పండుగల సమయంలో తన అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు. కాగా.. ఫారుఖ్ కొత్త సినిమా ‘పఠాన్’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కాగా.. ప్రస్తుతం బాలీవుడ్‌లో బ్యాయ్‌కాట్ ట్రెండ్ నడుస్తున్నా.. షారుఖ్ సినిమాకు మాత్రం ఆ సెగ తగలలేదు. సినిమాల సంగతి పక్కనపెడితే.. షారుఖ్ ఖాన్ గణేష్ పూజలో పాల్గొనడంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.







