UPDATED 6th JULY 2017 THURSDAY 5:00 PM
పెద్దాపురం: పెద్దాపురం మండలం పులిమేరు శాంతివర్ధనా మానసిక వికలాంగుల పాఠశాలలో కాకినాడ ఎంపీ తోట నరసింహం జన్మదిన వేడుకలను గురువారం చిన్నారుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేకును కట్ చేసి వారితో సరదాగా గడిపారు. అనంతరం ఎంపీ నరసింహం మాట్లాడుతూ మానసిక వికలాంగులు దైవంతో సమానమని వారి పట్ల ప్రేమాభిమానాలు చూపాలన్నారు. అనంతరం వారికి దుప్పట్లు పంచారు. పాఠశాల నిర్వహిస్తున్న కరెస్పాండెంట్ రాయవరపు వీరబాబును ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు కొత్తెం వెంకట శ్రీనివాసరావు (కోటి), బూరుగుపూడి సర్పంచ్ పాఠంశెట్టి సూర్యచంద్ర, పచ్చిపాల ప్రసాదరావు (గోరింట ప్రసాద్), తుమ్మల రాజా, రాము, బుల్లియ్య తదితరులు పాల్గొన్నారు.







