ప్రతి గిరిజనుడికి పది ఎకరాల భూమి : కర్నాకుల

గంగవరం (రెడ్ బీ న్యూస్) 11 నవంబర్ 2021: అటవీ హక్కుల చట్టం ప్రకారం ప్రతి గిరిజనుడికి పది ఎకరాల భూమి అప్పగించి, పట్టాలు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతుకూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు డిమాండ్ చేశారు. విప్లవ అమర వీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కామ్రేడ్ రంగవల్లి అక్క 22వ వర్ధంతి వేడుకలు గంగవరంలో గురువారం జరిగాయి. ఈ సమావేశం రంపచోడవరం డివిజన్ కార్యదర్శి సురేష్ అధ్యక్షతన జరిగింది. అనంతరం కర్నాకుల మాట్లాడుతూ ఆదివాసీ హక్కుల కోసం రంగవల్లి అక్క పోరాటాలకు నాయకత్వం వహించి లక్షల మంది గిరిజనులను చైతన్యం చేసిందన్నారు. వేలాది ఎకరాల పోడు భూములను సాగులోకి తీసుకొచ్చారనన్నారు. గిరిజనుల ఆధీనంలో ఉన్న భూములను క్రమబద్ధీకరణ చేసేందుకు భూ హక్కుల చట్టం వచ్చి 14 సంవత్సరాలు అయినా చట్టం కార్యరూపం దాల్చలేదన్నారు. యూపీఏ ప్రభుత్వం విమర్శించి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆదివాసీలను అడవి నుంచి గెంటివేసి అటవీ భూములను కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ముందుగా రైతుకూలీ సంఘం నాయకులు గంగవరంలో ర్యాలీ నిర్వహించి కామ్రేడ్ రంగవల్లికి నివాళులు అర్పిస్తూ మౌనం పాటించారు. ఈకార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతుకూలీ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు బాదంపూడి బాబురావు, జిల్లా అధ్యక్షుడు రాజబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రమేష్, సహాయ కార్యదర్శి సతీష్, ఏ.ఐ.ఎఫ్.టీ.యూ జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్, చిన్నా రావు, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us