UPDATED 3rd AUGUST 2017 THURSDAY 8:00 PM
మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న స్పైడర్ చిత్రంలోని ఓ ఫైట్ సీన్ కోసం సుమారు 20కోట్లు వెచ్చించారనే వార్త దక్షిణాది పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఈ మూవీలో మహేష్‌బాబు పోలీస్ గూఢచారి పాత్రలో కనిపిస్తారని చెబుతున్నారు. సస్పెన్స్, థ్రిల్లర్ అంశాల మేళవింపుతో దర్శకుడు మురుగదాస్ ఈ చిత్రాన్ని స్టైలిష్ గా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే మహేష్‌బాబు, విలన్ ఎస్.జె.సూర్య మధ్య ఓ ఫైట్ సీన్లను తెరకెక్కించారు. ఎనిమిది నిమిషాల పాటు సాగే ఈ ఎపిసోడ్ మూవీకి అట్రాక్షన్ గా నిలుస్తుందని చిత్ర బృందం చెబుతున్నది. కథాగమనంలో కూడా ఈ ఫైట్ సీక్వెన్స్ కీలక మలుపుగా ఉంటుందని తెలిసింది. ఎనిమిది నిమిషాల సన్నివేశం కోసం దాదాపు ఇరవై కోట్ల భారీ వ్యయాన్ని చేశారని సమాచారం. గ్రాఫిక్స్ హంగులతో ఈ ఫైట్ సీన్లను తీర్చి దిద్దారని తెలిసింది. తమిళ, తెలుగు భాషల్లో రూపొందు తున్ను ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నెల 9న మహేష్‌బాబు బర్త్ డే సందర్భంగా ప్రత్యేక టీజర్‌ను విడుదల చేయనున్నారు. రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని దసరా కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ సంతోష్‌శివన్, మ్యూజిక్ హేరిస్జైరాజ్, ఎడిటింగ్: శ్రీకరప్రసాద్, సమర్పణ: ఠాగూర్ మధు, నిర్మాత: ఎన్.వి.ప్రసాద్.







