AP News:మహిళ కమిషన్‌ సభ్యులుగా మరో ముగ్గురు

UPDATED 14th FEBRUARY 2022 MONDAY 08:45 PM

మంగళగిరి: రాష్ట్ర మహిళ కమిషన్‌ సభ్యులుగా మరో ముగ్గురు సోమవారం మంగళగిరిలోని రాష్ట్ర కార్యాలయంలో పదవీ ప్రమాణం చేశారు. ఇప్పటికే గజ్జల వెంకట జయలక్ష్మి, కర్రి జయశ్రీ కమిషన్‌ సభ్యులుగా వుండగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా గడ్డం ఉమ (విశాఖపట్టణం), బూసి వినీత (తణుకు), డాక్టర్‌ షేక్‌ రుకియా బేగం (గుంతకల్‌) ప్రభృతులను సభ్యులుగా నియమించింది. ఈ ముగ్గురి చేత కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ మంగళగిరిలోని తమ కార్యాలయంలో పదవీప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ కొత్తగా వచ్చి చేరిన ముగ్గురితో తమ కమిషన్‌ మరింత బలోపేతమయ్యిందని వ్యాఖ్యానించారు. తమ కమిటీపై ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి వుంచిన గురుతర బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తామని ఆమె చెప్పారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us