ప్రారంభమైన పచ్చాలమ్మ జాతర

UPDATED 10TH MAY 2017 TUESDAY 6:00 PM

పెద్దాపురం: పెద్దాపురం మండలంలోని గుడివాడ గ్రామ దేవత పచ్చాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా పూల గరగ ను తీసి  ఉత్సవాలు ప్రారంభానికి అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కనపర్తి సత్యానందం (తాత) మాట్లాడుతూ పచ్చాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ నెల 25  నుంచి ప్రారంభమవుతాయని, ఉత్సవాలలో భాగంగా పలు సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థుల సహాయ సహకారాలతో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.     
 
 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us