Whatsapp: ఇకపై యాప్ లోనూ ఫోటో ఎడిట్!

రెడ్ బీ న్యూస్,17 జనవరి 2022 : మొబైల్ యూజర్లకు వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ను పరిచయం చేయనుంది. ఇప్పటి వరకు డెస్క్ టాప్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న డ్రాయింగ్ టూల్/ ఫొటో ఎడిట్ టూల్ ను త్వరలో మొబైల్ వెర్షన్లో కూడా తీసుకొస్తున్నట్లు వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో (వాబీటా ఇన్ఫో) తెలిపింది. మొబైల్ వాట్సాప్ లో రెండు వెర్షన్లలో ఈ టూల్ ను తీసుకొస్తున్నట్లు సమాచారం. ఇందులో ఒకటి ఫొటోల కోసం కాగా, రెండోది వీడియోలను ఎడిట్ చేసేందుకని వాబీటాఇన్ఫో వెల్లడించింది. ఈ టూల్ లో యూజర్లు తాము ఇతరులకు పంపే ఫొటోలను క్రాప్ చేయడంతోపాటు, ఫొటోలపై ఎమోజీలు, జిఫ్, టెక్స్ట్ ను యాడ్ చేయొచ్చు. వీడియోలకు ఈ టూల్ ఎలా ఉపయోగపడుతుంది అనేది తెలియాల్సి ఉంది..ఇవే కాకుండా వాట్సాప్ డెస్ టాప్ యూజర్ల కోసం యూజర్ ఇంటర్ ఫేస్ (యూఐ)లో మార్పులు చేయడంతోపాటు, చాట్ బబుల్స్ అనే కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. అలానే చాట్ బార్ రంగులు కూడా మార్చుకునేందుకు వీలుగా కొత్త అప్ డేట్ ను పరిచయం చేయనుంది. వీటితోపాటు బ్యాక్ గ్రౌండ్ వాయిస్ మెసేజ్, చాట్ లిస్ట్ మార్పులు, అడ్వాన్స్ సెర్చ్ వంటి కొత్త పీచర్లను వాట్సాప్ తీసుకురానుంది. మిగతా మెసేజింగ్ యాప్ లతో పోలిస్తే గత కొద్ది నెలలుగా వరుస కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వాట్సాప్ వినియోగాన్ని మరింత యూజర్ ఫ్రెండ్లీ యాప్ గా మార్చే ప్రయత్నం చేస్తోంది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us